యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై బొలెరో వాహనం కారు ఢీకొని ఒక మహిళ మృతి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు మాచర్ల వద్ద గల కొత్తపల్లికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 15 మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బొలెరోలో ప్రయాణిస్తున్న వారు ఖమ్మం జిల్లా కారేపల్లి వాసులుగా తెలిపారు.