గిద్దలూరు: కొమరోలు మండలం టేకులపెంట గ్రామంలో హత్య చేసిన నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ మార్కాపురం కోర్టు తీర్పు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం టేకుల పెంట గ్రామంలో శివ అనే వ్యక్తిని 2015లో అదే గ్రామానికి చెందిన లింగమయ్య, తిరుమలయ్య, కోటయ్య, చిన్న అల్లురమ్మ అనేవారు హత్య చేశారు. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో పూర్తి సాక్షాదారాలను ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన మార్కాపురం కోర్టు నేరం రుజువు కావడంతో మంగళవారం నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.