రాయదుర్గం: మల్లాపురం పరిధిలో చదం గేట్ సమీపంలో 40 ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
రాయదుర్గం మండలంలోని మల్లాపురం పరిధిలో చదం గేట్ సమీపంలో అక్రమంగా డంప్ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం డిజిటల్, సోషల్ మీడియా లో వచ్చిన వార్తా కథనాల నేపథ్యంలో తహసీల్దార్ సూర్యప్రతాప్ సర్వే నెంబర్ 117 లో తనిఖీ చేశారు. సుమారు 40 ట్రాక్టర్ల ఇసుక అక్రమ నిల్వ చేశారని నిర్దారించి సీజ్ చేశారు. నిబంధనల మేరకు ఇసుక సొంత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని, అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.