మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టును ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
వెనుకబడిన ఈ ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని జాతికి అంకితం చేస్తున్నామని చేయకుండానే ప్రజలను మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నారు. ఆగస్టు నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రజలు కన్నులు తెరిచి పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.