కొండపి: సింగరాయకొండలో గ్యాస్ కొరతతో కరెంటు పోయి లను ఆశ్రయిస్తూ తమ వ్యాపారాలు చేసుకుంటున్న హోటల్ యాజమాన్యాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో గ్యాస్ కొరత, గ్యాస్ పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న హోటల్స్ యాజమాన్యాలు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. కరెంటు పోయిల మీద తమ వంటకాలు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. కట్టెలు, గ్యాస్ దొరకడం కష్టంగా మారడంతో కరెంటు పోయిలను వినియోగిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది. రుచికి ఎటువంటి కొదవ లేకుండా ఉంటుందని అన్నారు.