దర్శి: పోతవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు
Darsi, Prakasam | Apr 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో శనివారం నుంచే జిల్లా కలెక్టర్ రాజాబాబు గ్రామంలో పర్యటించారు. శుక్రవారం రాత్రి 12 నిద్రలో భాగంగా గ్రామంలో బస చేసిన విషయం తెలిసినదే. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి సరఫరాలను పరిశీలించారు. స్థానికంగా లభిస్తున్న ప్రభుత్వ సేవలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వీధిలో తిరుగుతూ గ్రామస్తులు చెప్పే సమస్యలను వింటూ పరిష్కరిస్తామని తెలిపారు.