యర్రగొండపాలెం: వైపాలెంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ లో భాగంగా 39,274 మంది రైతులకు 25 కోట్ల 96 లక్షల రూపాయలు మంజూరు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత నిధులు మంజూరైనట్లు టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు తెలిపారు. నియోజకవర్గంలో 39,274 మంది రైతులకు 25 కోట్ల 96 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.