రాయదుర్గం: బాదిడుడి ప్రాణాలు కాపాడిన బొమ్మనహాల్ ఏఎస్ఐ విజయ్, పోలీసు సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ జగదీష్
రోడ్డు ప్రమాద ఘటనలలో తీవ్రంగా గాయపడి ట్రాక్టర్ లో ఇరుక్కుపోయిన వ్యక్తి ని కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. బొమ్మనహాల్ మండలంలోని శ్రీనివాస క్యాంప్ వద్ద ట్రాక్టర్ ఇంజన్ ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ కుళాయిస్వామి కాలు ట్రాక్టర్ లో ఇరుక్కుపోయి కాలు తీయడానికి వీలు పడని పరిస్థితిలో బొమ్మనహాల్ ఏఎస్ఐ విజయ్, పోలీసు సిబ్బంది కట్టర్లు తెప్పించి చాకచక్యంగా ప్రాణాలు కాపాడారు. వెంటనే స్పందించి, సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలు కాపాడారని కొనియాడారు. పోలీసుల మానవత్వాన్ని, సేవానిరతిని స్థానిక ప్రజలు సైతం మెచ్చుకున్నారని ఎస్పీ వెల్లడించారు.