గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో అగ్ని ప్రమాదం, మంటల్లో దగ్ధమైన వరిగడ్డివాము, మంటలను అరిపివేసిన అగ్నిమాపక శాఖ అధికారులు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో అగ్నిప్రమాదం జరిగింది. పశువుల ఆసుపత్రి సమీపంలోని ఇళ్ల మధ్యలో ఉన్న వరిగడ్డి వాము నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళన చెందిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ ఇంజన్ సహాయంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది మంటలను ఆర్పి వేస్తారు. సకాలంలో స్పందించడం వల్ల భారీ అగ్ని ప్రమాదం తప్పినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే గడ్డివాముకు మంటలు ఎలా అంటుకున్నాయో అర్థం కాలేదని వరిగడ్డివాము యజమాని తెలిపాడు. దాదాపు రూ.60 వేలు వరకు ఆర్థికంగా నష్టపోయినట్లుగా తెలిపారు.