రాయదుర్గం: రైతులకు అండగా నిలుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం శిరిగేదొడ్డి గ్రామంలో రైతులకు రాయితీపై వేరుశనగ విత్తన కాయలను ఆయన పంపిణీ చేశారు. పంపిణీ చేసిన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.