రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బైక్ - బొలెరో ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొంతానపల్లి లక్ష్మణ్ణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాలమేరకు లక్ష్మన్న బైక్ పై బుధవారం కొంతానపల్లి వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన కొరియర్ బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మన్న కాలు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్ ద్వారా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.