గిద్దలూరు: రాచర్ల మండలం జేపీ చెరువు లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం
మార్కాపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చి స్వామివారికి తలనీనాలు సమర్పించి అనంతరం రంగనాయక స్వామివారిని దర్శించుకున్నారు. రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు 2వ తేదీ నుంచి 5వ ఇదివరకు జరుగుతాయని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. 2న అంకురార్పణ, 3వ తేదీ స్వామి వారి కళ్యాణం, 4వ తేదీ తెప్పోత్సవం, 5వ తేదీ చక్ర స్నానం ఉంటుందని అర్చకులు తెలిపారు.