కళ్యాణదుర్గం: మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి: కుందుర్పిలో ఎంఈఓ లక్ష్మీదేవి
భారతదేశ మాజీ ఉప ప్రధాని,ప్రముఖ సంఘ సంస్కర్త,స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కుందుర్పి మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీదేవి పిలుపునిచ్చారు.కుందుర్పి మండల కేంద్రంలోని ఎంఆర్సి భవనంలో ఆదివారం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.