మార్కాపురం: బోడపాడు చెరువు కాలువ వెంట ఒరిగిపోయి ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు
మార్కాపురం మండలం బోడపాడు చెరువు కాలువను ఆధునీకరణ పనుల్లో భాగంగా పూడిక తీశారు. తీసిన మట్టిని కాలువ ఆనుకొని కట్టలాగా పోశారు. పోసిన మట్టిని కొంతమేర తొలగించడంతో విద్యుత్ స్తంభాలు ఒక వైపుకు ఒరిగిపోయాయి. స్తంభం చుట్టు మట్టి ఉన్నప్పటికీ వర్షం పడితే తడిసిపోయి ఎప్పుడు కింద పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.