దర్శి: మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన దర్శి ఎస్ఐ మురళి
Darsi, Prakasam | May 23, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఎస్ఐ మురళి హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు జరిమానా జైలు శిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు గురి కావద్దని అన్నారు.పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.