గిద్దలూరు: కంభం పట్టణంలో కలెక్టర్ విజయ సునీత పర్యటన, సర్ సర్వే కార్యక్రమం నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్ర ఆగ్రహం
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో కలెక్టర్ విజయ సునీత పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో బి.ఎల్.వోలు నిర్వహిస్తున్న సర్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్వే శాతం 40 శాతానికి మించకపోవడంతో కలెక్టర్ విజయ సునీత బిఎల్ఓ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం 3 ఇంజనీరింగ్ అసిస్టెంట్ వంశీ రాయల్ పై సహనం వ్యక్తం చెయ్యడమే కాకుండా సక్రమంగా విధులను నిర్వహించాలని నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం లోపు సర్వేపై పూర్తి ప్రోగ్రెస్ రిపోర్టు తనకు పంపాలని లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.