మార్కాపురం: జిల్లాలోని వివిధ ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయ సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాను ప్రపంచవ్యాప్తంగా చేయడంలో కీలక పాత్ర పోషించారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21వ తేదీ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు యువత పాల్గొనాలన్నారు.