మార్కాపురం: జిల్లా కేంద్రంలోని బిలాల్ మసీదు బజార్లో వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని పూల సుబ్బయ్య కాలనీలో బిలాల్ మసీద్ బజార్లో చిన్నపాటి వర్షానికి ప్రధాన రోడ్డు చెరువును తలపిస్తుంది. కొన్ని రోజుల క్రితం పడిన ఓ మోస్తరు వర్షానికి రోడ్డుమీద నీరు నిలిచిపోయి పాచి పట్టింది. దీంతో వాహనదారులు పాదాచార్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.