రాయదుర్గం: డి.హిరేహాల్ లో వృద్దుడు మిస్సింగ్, కేసు నమోదు
మొహరం పండుగకు కూతురిని తీసుకువస్తానని వెళ్లిన వృద్ధుడు కనిపించకుండా పోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. డి.హీరేహాల్ గ్రామానికి చెందిన కురుబ నాగేంద్రప్ప (64), తండ్రి లేట్ సన్న సిద్దప్ప ఈ నెల 24 న ఉదయం 10 గంటల సమయంలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హోతూరులో ఉన్న కూతురు మహంకాళిని పిలుచుకువస్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే కూతురు ఇంటికి చేరలేదు, తిరిగి స్వగ్రామానికీ రాలేదు. బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 9490109174 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.