కొండపి: మర్రిపూడి మండలంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయపాలెంలో ఏరువాక కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ రాజాబాబు తో పాటు మంత్రి స్వామి హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులలో కలెక్టర్ రాజాబాబుతో పాటు మంత్రి స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో రైతులు సంక్షేమంగా సుభిక్షంగా ఉన్నారని మంత్రి స్వామి అన్నారు. మహిళలు చిన్నారులు సాంప్రదాయ దుస్తులలో పాల్గొని బోనం సమర్పించి ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.