మార్కాపురం: ప్రజా దర్బార్ కార్యక్రమం వల్ల మంచి సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో సుమారు 130 అర్జీలు వచ్చాయన్నారు. వాటిలో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. 90 శాతం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నమన్నారు. పరిష్కారం కానివి ఎందుకు కాలేదో తెలియజేయడం జరుగుతుందన్నారు.