దర్శి: దర్శి పట్టణంలో ప్రధానోపాధ్యాయురాలు భగవద్గీత దేవి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ
Darsi, Prakasam | Jun 28, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ప్రధానోపాధ్యాయురాలు భగవద్గీత దేవి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు యజ్ఞం వంటిదని అన్నారు. ఆమె సుమారు 31 సంవత్సరాలు ఎంతో నిబద్దతో వృత్తి ధర్మాన్ని పాటించారని పేర్కొన్నారు.