కొండపి: టంగుటూరు మండలం ఆలకూరపాడులో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో బుధవారం పేకాట ఆడుతున్న నలుగురికి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.5,888 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరిత్య నేరమని ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 112 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.