యర్రగొండపాలెం: గారపెంట గ్రామంలో నీలంపాటి అమ్మవారి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గార పెంట గ్రామంలో నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నీలంపాటి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.