రాయదుర్గం: ఇచ్చిన ప్రతీ అర్జీ పరిష్కారం కావాల్సిందే : 74 ఉడేగోళంలో జిల్లా కలెక్టర్ ఆనంద్
ఇచ్చిన ప్రతీ అర్జీ పరిష్కారం కావాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ స్పష్టం చేశారు. ఒక నెల నాలుగు సందర్శనలు పేరుతో రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో శుక్రవారం మూడవ సారి పర్యటించారు. గత వారాల్లో ఇచ్చిన అర్జీల పరిష్కారం పై పిర్యాదుదారుల సమక్షంలోనే ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులుతో కలసి సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. వందశాతం పరిష్కారమే లక్ష్యంగా ఒకే ఎరిలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ హరికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.