రాయదుర్గం: పట్టణంలో ఘనంగా ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాయదుర్గం సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏఐవైఎఫ్ రాయదుర్గం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగయ్య పతాకావిష్కరణ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల కోసం ఏఐవైఎఫ్ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. యువత హక్కుల కోసం, సామాజిక మార్పు కోసం, దోపిడీ రహిత సమాజం కోసం ఏఐవైఎఫ్ పాటుపడుతుందని తెలిపారు.