రాయదుర్గం: తప్పిపోయిన బాలున్ని గంటల వ్యవధిలోనే తల్లిదండ్రుల వద్దకు చేర్చిన రాయదుర్గం పోలీసులు
రాయదుర్గం పట్టణంలో పెట్రోలు కోసం తండ్రితో పాటు వచ్చి తండ్రి ఏమరపాటుతో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం సరే ఆ బాలుడు ఇంటికి వెళ్లే దారి తెలియక బళ్ళారి రోడ్డులో తిరుగుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు కానిస్టేబుళ్లు రాజప్ప, రాము అక్కడికి చేరుకొని బాలుడిని చేరదీసి, ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ఫొటోతో సహా సమాచారం వ్యాప్తి చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడిని వారికి అప్పగించారు.