కొండపి: రైతుబిడ్డగా సీఎం చంద్రబాబుకు రైతుల కష్టాలన్నీ తెలుసు, సబ్సిడీపై విత్తనాలు యంత్రాలు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
రైతు బిడ్డగా సీఎం చంద్రబాబుకు రైతుల కష్టాలు తెలుసునని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సోమవారం మరిపూడి మండలం రామాయపాలెంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి మంత్రి స్వామి మెరిశారు. రైతే రాజుగా చూడాలన్న తలంపుతో సీఎం చంద్రబాబు సబ్సిడీపై విత్తనాలు అందించారని, యంత్రాలు అందించారని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు అందిస్తున్నారన్నారు. గిట్టుబాటు ధరలు కూడా కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు.