కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోలు ప్రారంభించిన వేలం నిర్వహణ అధికారి శంకర్రావు, చైర్మన్ యశ్వంత్ కుమార్
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో గురువారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేలం నిర్వహణ అధికారి శంకర్రావు, చైర్మన్ యశ్వంత్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 18 పొగాకు పొగాకు బేళ్లు రైతులు తీసుకురాగా 18 కొనుగోలు అయినట్లు అధికారులు తెలిపారు. గరిష్ట ధర కేజీ రూ.250 పలుకుతున్నట్లుగా నిర్వహణ అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు పొగాకు వేలం కేంద్ర వద్ద పూజలు నిర్వహించారు.