మార్కాపురం: జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం విజయలక్ష్మి వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... పట్టణంలో సుమారు 5930 పింఛన్లు గాను 2 కోట్ల 65 లక్షల 28 వేలు ప్రతినెల 1వ తేదీ ఇస్తున్నామన్నారు. గతంలో ఒకటో తేదీకి పింఛన్ లేదు జీతం లేదు ఇబ్బందులు చూసామన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎం రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారు.