కొండపి: కొండపిలో ఉపాధి హామీ అధికారుల ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం, రికార్డులు పరిశీలించిన పిడి జోసఫ్ కుమార్
ప్రకాశం జిల్లా కొండపి మండల కేంద్రంలో శనివారం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఉపాధి హామీ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పిడి జోసెఫ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పటివరకు 19 పంచాయతీలలో ఎంత నిధులు ఖర్చు చేశారో అలానే ఉపాధి హామీ పనులు ఎంతవరకు జరిగాయో జోసఫ్ కుమార్ సంబంధిత అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. నిధులు చెల్లింపు బకాయిలు వంటి బిల్లులపై దృష్టి సారించి పూర్తి నివేదిక ఇవ్వాలని తెలిపారు.