మార్కాపురం: మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు
మార్కాపురం జిల్లా కేంద్రంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారుల వెంట పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనపరిచారు. ప్రధాన సెంటర్లలో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. దీంతో పట్టణమంతా ప్లెక్సీలమయంగా మారింది. ఎటు చూసినా రకరకాల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి