మార్కాపురం: నిర్లక్ష్యం వహించిన ఆరు మంది బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు, ఒక పంచాయతీ సెక్రటరిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన ఆరు మంది బిఎల్ఓ లకు షోకజ్ నోటీసులు ఒక పంచాయతీ సెక్రెటరీ సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశాలు జారీ చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు అధికారులు ఆదేశాలను దిక్కరించడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్కాపురం 2,5,12 సచివాలయాలకు చెందిన బిఎల్ఓ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పెద్దారవీడు మండలం రామాయపాలెం పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.