కొండపి: సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని, ఆటోను ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ లో గాయపడ్డ ఇద్దరినీ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.