కొండపి: టంగుటూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ ని ఢీ కొట్టిన కారు, డ్రైవర్కి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా టంగుటూరులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ ని కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి గుంటూరుకు మిచ్చిలోడుకు వెళ్తున్న లారీ నుండి కొన్ని మిర్చి బస్తాలు క్రింద పడ్డాయి. వాటిని తిరిగి లారీకి తరలిస్తున్న క్రమంలో కారు డ్రైవర్ ను ఢీ కొట్టింది. గాయపడ్డ డ్రైవర్ ను అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.