మార్కాపురం: తర్లుపాడు మండలంలో పాఠశాల భవనం లేకపోవడంతో చర్చిలో తరగతుల నిర్వహణ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం లేక స్థానిక చర్చిలో తరగతులు జరుగుతున్నాయి. సుమారు 30 మంది విద్యార్థులు ఇద్దరూ ఉపాధ్యాయులు ఉన్నారు. గత ఏడు సంవత్సరాల నుండి చర్చిలోనే క్లాసులు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఒకపక్క ప్రార్థనలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అన్నారు. అధికారులు చొరవ తీసుకొని పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని వారు కోరారు.