పెద్దారవీడు మండలం వైడిపాడు జడ్పీహెచ్ పాఠశాలలో మనబడి మన పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభమైన సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు పూలు జల్లుతూ హారతులతో ఘన స్వాగతం పలికారు. పండుగ వాతావరణం లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు హెచ్ఎం రమణయ్య తెలిపారు.