కొండపి: పొగాకు కొనుగోలు చేస్తాం, కొత్త పెన్షన్లు కూడా అందిస్తాం: పొన్నలూరులో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి వెల్లడి
కొండపి పరిసర ప్రాంతాలలో రైతులు పండించిన పొగాకుని తప్పనిసరిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి స్వామి అన్నారు. శనివారం నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాలలో మంత్రి స్వామి పాల్గొన్నారు. అతి త్వరలో నూతన పెన్షన్లు అందిస్తామని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేస్తే వాటికి వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు సీఎం అందిస్తున్నారన్నారు. పరిశ్రమల స్థాపనకు తన వంతు కృషి చేస్తానని మంత్రి అన్నారు.