దర్శి: తూర్పు గంగవరం లో గుంటి గంగమ్మ తిరుణాల సందర్భంగా అమ్మ వారి గ్రామోత్సవం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల పరిధిలోని గుంటి గంగమ్మ తిరుణాల సందర్భంగా ముందు రోజు ప్రతి సంవత్సరం గంగమ్మ అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవరపాడు తూర్పు గంగవరంలో అమ్మవారి బ్రహ్మోత్సవం నిర్వహించారు. అమ్మవారికి మహిళలు హారతులు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఏప్రిల్ మూడవ తేదీన గుంటి గంగమ్మ తిరణాల ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.