రాయదుర్గం: జూలై 1 నుండి పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం : మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి
జూలై 1వ నుంచి ప్లాస్టిక్ వినియోగించిన యెడల జరిమానా విధించబడుతుందని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాయదుర్గం పట్టణంలోని ఓబులాచారి రోడ్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కమీషనర్ స్వయంగా రోడ్లు ఊడ్చి శ్రమదానం చేశారు. స్వచ్చ రాయదుర్గం సాదనలో పాలుపంచుకుంటానని, రాయదుర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కూరగాయల మార్కెట్‌కు వెళ్లి అక్కడి వ్యాపారస్తులకు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకుండా క్లాత్ కవర్లు వినియోగించాలని అవగాహన కల్పించారు.