తాడిపత్రి: యాడికి శివారులోని పెండేకల్లు రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
యాడికిలో జలధార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం హాజరైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెండేకల్లు రిజర్వాయర్ వద్ద రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. బిందు, ప్రకృతి వ్యవసాయం, ఉపాధి పనులు, డ్రిప్ ఇరిగేషన్, హార్టికల్చర్ పై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను సరఫరా చేస్తున్నదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని రైతులు కూడా పంట మార్పిడులు చేసుకోవాలని సీఎం సూచించారు. రైతులతో మాట్లాడిన వీడియోలు డీపీఆర్ఓ కార్యాలయ సిబ్బంది మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో విడుదల చేశారు.