గిద్దలూరు: కారుమంచి లోని మూసి వాగులో ఈతకు వెళ్లి 13 సంవత్సరాల బాలుడు మృతి, మరో ఇద్దరు చిన్నారులను కాపాడిన స్థానికులు
ప్రకాశం జిల్లా కారుమంచి లోని మూసి వాగులో ఈతకు వెళ్లి 13 సంవత్సరాల బాలుడు కార్తీక్ అనే బాలుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన కార్తీక్ నీళ్లలో దిగిన సమయంలో ఊపిరి ఆడక మృతి చెందాడు. మిగతా ఇద్దరు చిన్నారులను స్థానికులు రక్షించారు. జరిగిన ఘటనపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కార్తీక్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.