కొండపి: పొన్నలూరు తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పని చేస్తుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పొన్నలూరులో సోమవారం ప్రజా సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పుల్లారావు తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.