గిద్దలూరు: గిద్దలూరు న్యాయమూర్తి భరత్ చంద్ర ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మతిస్థిమితం లేని వ్యక్తి, పోలీసులకు అప్పగింత
మార్కాపురం జిల్లా గిద్దలూరు న్యాయమూర్తి భరత్ చంద్ర ఇంటిలోకి గుర్తు తెలియని మతిస్థిమితం లేని వ్యక్తి ప్రవేశించేందుకు ఆదివారం ప్రయత్నించాడు. ఆరుబయట ఆరబెట్టి ఉన్న జడ్జి భరత్ చంద్ర దుస్తువులను ధరించిన మతిస్థిమితం లేని వ్యక్తి న్యాయమూర్తి ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. భరత్ చంద్ర పెంచుకుంటున్న రెండు శునకాలు గట్టిగా అరవడంతో కోర్టు సెక్యూరిటీ గార్డులు విషయాన్ని గుర్తించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులకు అప్పగించగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.