దర్శి: దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక : డీఎస్పీ బాలమురళీకృష్ణ
Darsi, Prakasam | Jun 21, 2026 ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణంలో జూన్ 22వ తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో స్పష్టంగా రాసి అందజేయాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు వినతులు పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.