మార్కాపురం: 23వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... నిరుపేదలకు తన చేతుల మీదుగా పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో ఒకే రోజు 5960 పింఛన్లను పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం పింఛన్ సంవత్సరానికి ₹250 పెంచి మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 99% సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు