మార్కాపురం: జిల్లా కేంద్రంలో మెగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కరించేందుకే ప్రజాధర్బార్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం ఓ ఫంక్షన్ హాల్ లో మెగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలు 115 అర్జీలు సమర్పించారని వాటిలో 78 రెవెన్యూ సమస్యలు 37 ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. పరిష్కారం కానివి ఎందుకు కాలేదో వివరించడం జరుగుతుందన్నారు.