దర్శి: దర్శి మండలం వెంకటాచలం పల్లి కొండకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
Darsi, Prakasam | Jun 10, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి కొండపై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పు పెట్టి ఉండవచ్చని స్థానికులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఎండల కరణంగా కొండపై మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో దూర ప్రాంతాల నుంచే మంటలు భారీగా కనిపించాయి. వేసవి ఎండలు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.