యర్రగొండపాలెం: తోక పల్లి గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం తోక పల్లి గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. గ్రామంలోని గ్రామస్తులు స్వామి వారికి పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు.