మార్కాపురం: పొదిలి పొగాకు వేలంకేంద్రంలో పొగాకు బేళ్లను కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన
మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలంకేంద్రంలో 50% కూడా పొగాకు బేళ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అసలే గిట్టుబాటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తీసుకొచ్చిన పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రాత్రి పగలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని 100% పొగాకుబేళ్లను కొనుగోలు చేయాలని కోరారు.